Sunday, July 27, 2008

గోభీ పరాఠాకాలీఫ్లవర్ తో చేసుకునే ఈ ఉత్తరాది వంటకం బావుంటుంది. కూర లాంటిది (Side dish) లేకున్నా పర్లేదు. కావలసిన వస్తువులు: గోధుమ పిండి: అర కిలో నెయ్యి: ఒక గరిటెడు కాలిఫ్లవర్ ముక్కలు: పావు కిలో కొత్తిమీర: కొద్దిగా గరం మసాలా పొడి: తగినంత అల్లం: కొంచెం ఉప్పు: తగినంత చేసే విధానం: గోధుమపిండిలో ఒక చెంచా నెయ్యి వేసి, తగినంత ఉప్పు, సరిపడా నీరు పోసి ముద్దగా కలపి తయారుగా ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం సన్నగా తరిగి, గరం మసాలా పొడి కలిపి, అందులో తరిగిన కాలిఫ్లవర్ ముక్కలు కలిపి ఉంచుకోవాలి. గోధుమపిండిని గుండ్రంగా వత్తుకుని, అందులో కాలిఫ్లవర్ మిశ్రమాన్ని ఉంచి మళ్ళీ ఉండలుగా చేసుకోవాలి. దాన్ని విడిపోకుండా మరలా గుండ్రంగా, పల్చగా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న పరాఠాల్ని పెనమ్మీద నెయ్యతో వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి. ఓపికనీ, జిహ్వ చాపల్యాన్నీ బట్టి కర్రీ ఏదైనా చేసుకోవచ్చు

No comments: