Tuesday, July 05, 2016

ఒక వ్యాసాన్ని వ్రాయడమంటే అందమైన శిల్పాన్ని చెక్కినట్లే

  I like this sentiment
  All this talk of Plagiarism is one created by copyrights holders, who have kept increasing the time a creater of  an essay /story/novel/fiction or nonfiction book should  keep getting  royalties.

 "FROM
JVRK PRASAD
who has done a good job on Telugu WIKI diabetes mellitus essay
  • నిన్ను ఏనాడూ ఎవరూ మెచ్చుకోరు, గుర్తించరు, అభినందించరు, ఇత్యాది వాటి కోసం ఏనాడూ పాకులాడకు, అలాంటివి నువ్వు కావాలనుకున్నప్పుడు లభించవు.

  • ఒక వ్యాసాన్ని వ్రాయడమంటే అందమైన శిల్పాన్ని చెక్కినట్లే ! వ్యాసం పూర్తయితే అపురూప భవంతి కట్టినట్లే !! ఎన్నెన్నో శిల్పాలు, భవంతులున్నా కొన్ని మాత్రమే అజరామరం !!!
  • ఏ పని అయినా ఎలాగయినా చేయవచ్చును. కానీ దానిని కాస్త అందంగా ఆ పేజీని (పుటని) చూపించగలగితే చదువుకునే వారికి ఆహ్లాదముగా ఉంటుంది అని నా భావన. వికీ అంటేనే ఎవరు చేసిన పని శాశ్వతం కాదు. ఏ పని ఎవరికీ శాశ్వతం కాదు. ఏదీ ఎవరి సొంతం కాదు. వికీ అంటేనే స్వంతం అనేది ఏదీ లేదు. వికీ అంటేనే క్షణం క్షణం మారిపోయేది. అందువల్ల మనసులో నేను ఏమీ పెట్టుకోను. ఈ పని త్వరగా అయింది కొంతవరకైన అనే సంతృప్తి మిగిలితే, *నేను మరికొన్ని మంచి కొత్త విషయములతో కూడిన విద్యావిషయ సంబంధించినవి అందించుటకు సరస్వతిదేవి నా హస్తమునకు స్నేహము అందించగలదని ఆశిస్తాను.
  • నువ్వు వేల వ్యాసాలు ఒకేసారి ప్రారంభం, పూర్తి చేసి విందు భోజనం తయారు చేయాలనుకుంటావు, కానీ ఆకలితో ఉన్న బిడ్డకు బిస్కత్తు ఇచ్చినట్లు ఒక వ్యాసం పూర్తి చేసిన తరువాత మరొకటి వ్రాయాలని తెలుకుంటే మంచిది.
  • I am definitely one of those who has done the same mistake(నువ్వు వేల వ్యాసాలు ఒకేసారి ప్రారంభం, పూర్తి చేసి విందు భోజనం తయారు చేయాలనుకుంటావు)
  • ఇక్కడ వ్రాసే వ్యాసాలు అంతర్జాలంలో తెలుగులోనే ఎన్నో చోట్ల లభ్యమవుతాయి. మరి అలాంటివి ఇక్కడ ఎందుకు వ్రాయడం ? తెలుగులో లేనివి కూడా ఇక్కడ వ్రాయకూడదంటాడు. ప్రతివాడు తను చెప్పేదే వినాలనుకుంటాడు, అదే వేదం అంటాడు. అదే వికీపీడియా మూలసూత్రం అంటాడు. దానికి పాత మరియు కొత్త అందరూ భజనలు చేస్తారు. గ్రూపులు కడతారు.
  • నువ్వు కోట్లమంది ప్రజల కోసం సొంతంగా పెద్ద పనులు గురించి ఒక్కడివే ఆలోచించి జీవితం లోని సమయాన్ని పాడుచేసుకోకు. పదిమందితో కలసి ఒకే ఒక వ్యాసంలో పాలుపంచుకుంటే గుర్తింపు ఉంటుంది.
  • నువ్వు వ్యాసాలకు పేర్లు మాత్రమే పెట్టానని ఎంతగా మెత్తుకున్న అవి వ్యాసాలు అనే ఎదుటి వారు అంటారు. వేల వ్యాసాలు ఒకేసారి నువ్వే పూర్తి చేస్తానంటావు, అందుకు ఒకరు మూస పెట్టాలంటారు. ఆ మూస అన్ని రోజులు, అన్ని వేల వ్యాసాలకు ఉండకూడ దంటారు. నీ ఆలోచనల విధానంతో కొత్తగా ఏదో చేయాలనుకుంటవు. బొమ్మలు పెట్టడం దగ్గర కూడా అనేక విమర్శలు. ఒకరు మొలకలు తీయాలంటే ఎక్కడ తీసివేస్తారోనని జాబితాలో అందులో చేర్చావు. మరొకరు జాబితాలు ఉండకూడ దంటారు. జాబితాలు తీసివేసి మూసలు పెడతావు. మూసలు ఎక్కువయ్యాయని ఉండకూడదంటారు ఇంకొకరు. తెలుగు వారు నివశిస్తున్న చదువుకున్నవారు, అంతర్జాల అవగాహన ఉన్నవారి మాత్రం కోసమే తప్పితే, నువ్వు అనుకున్నట్లుగా దేశంలో, విదేశాలలో ఉన్న ఎటువంటి చదువు లేకపోయినా ప్రతి తెలుగు బిడ్డ కోసం తెలుగు సమాచారం అందించాలనుకునే నీ తపన, తాపత్రయం చాలా తప్పు అని వికీ మూల సూత్రాలు ద్వారా మరో ఇద్దరు పెద్దలు నీకు నీతులు చెప్పేందుకు రాకుండానే, త్వరగా నీవు తెలుసుకున్నందుకు మనసులోనే మంచిదయ్యిందని సంతోషించితే, నీకు ఆనందం మిగులుతుంది. ఇక్కడ ఉన్న పదిమంది అభిప్రాయాలు చెప్పినట్ట్లుగా ఇలా అందరికీ నీ పనిలో లోపాలే కనబడతూ ఉంటే ఆపనిని ఎలా ముందుకు తీసుకు వెళ్ళగలవు.
  • అడవిలోని సింహం ఎవరి బంధు మిత్రుల సహాయ సహాకారాలు తనకోసం ఏనాడూ కోరుకోదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ జీవితంలో ఎదురయ్యే ఎటువంటి మనసుకు కష్టం కలిగించేవి వచ్చినా ఒంటరిగానే వాటిని ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని విడవక అండగా అందుబాటులోనే ఉంచుకుంటే ధైర్యంగా ముందుకు నీ జీవిత ప్రయాణ పయనము సాఫీగా సాగుతుంది."