Tuesday, December 27, 2016

Who eats like this ?

8/3/2015 3:25:15 AM

షుగర్‌కి ఇదే బెస్ట్ !


ఆరోగ్యం కూడా డబ్బు వంటిదే... దాని విలువను గ్రహించినంత కాలం మనతో ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వదిలి పోతుంది. అందుకే శరీరం మీద శ్రద్ధ పెట్టాలి.. అదే మనం నివసించే ఏకైక ప్రదేశం మరి.



ఎక్కువ స్వీట్లు తినకు.. షుగర్ వస్తుంది.., అన్నం తినొద్దు.. చపాతీలు మేలు.. ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. మధుమేహం గురించి ఇలాంటి ఎన్నో అపోహలు మనలో ఉన్నాయి. ఏం తినాలో.. ఏం తినొద్దో అర్థం కాని అయోమయంలో పడతాం. నిజానికి డయాబెటిస్‌కి ప్రత్యేక ఆహారం అంటూ లేదు. సమతులమైన ఆహారం తీసుకోవడం డయాబెటిస్‌కే కాదు.. జబ్బులను నివారించే మేలైన మంత్రం.

ఉదయం


-8 గంటలకు - మందులు వేసుకున్న తర్వాత 2 ఇడ్లీలు, 1 కప్పు సాంబార్, 1 ఉడికించిన కోడి గుడ్డు, ఒక జామ కాయ.
-11 గంటలకు - 1 గ్లాస్ మజ్జిగ, 4, 5 జీడిపప్పులు.

మధ్యాహ్నం


-ఒంటి గంటకు భోజనం- మందులు వేసుకున్నాక సలాడ్‌లో మెంతి పొడి, మిరియాల పొడి, ఉప్పు కలిపి తీసుకోవాలి. గింజలు కలిపి వండిన అన్నం, పప్పు, ఆకుకూర, మజ్జిగ, ఒక ముక్కబొప్పాయి పండు.

సాయంత్రం


-4 గంటలకు - స్వీట్ కార్న్, వెజ్ సాండ్విచ్, లేదా మొలకెత్తిన గింజలు.

రాత్రి


-8 గంటలకు - 2 ఫుల్కాలు, వెజ్ సలాడ్, ఆలు, రాజ్‌మా, లేదా శనగలు, గ్లాస్ మజ్జిగ, ఏదైనా ఒక పండు.
-నిద్రకు ముందు - ఒక కప్పు పాలు, రెండు వాల్‌నట్స్‌తో తీసుకోవచ్చు.

మధుమేహులు తీసుకునే ఆహారం అంటే ఆరోగ్యకరమైన ఆహారం అని అర్థం. ఇంట్లో ఒకరికి మధుమేహం వచ్చిందంటే ఇక అందరూ అదే రకమైన ఆహారానికి మారిపోతే మంచిది. మధుమేహులకు సమతుల ఆహారం ఇవ్వడం వల్ల షుగర్ స్థాయి అదుపులో ఉంటుంది. మధుమేహులకు ఇచ్చే ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.

కేలరీలు తగ్గించాలి


మనం తీసుకునే ఆహారం నుంచి మనకు లభించే శక్తిలో 350 కేలరీల వరకు ఈ ధాన్యాల నుంచే లభిస్తాయి. నూనెల నుంచి 900 కేలరీలు, గింజలు, పప్పుల నుంచి 500 కేలరీలు, చక్కర నుంచి 400 కేలరీలు, కూరగాయల నుంచి 60 కేలరీలు , పండ్ల నుంచి 120 కేలరీల వరకు లభిస్తాయి. అందుకే తక్కువ కేలరీలను అందించే పండ్లు, కూరగాయలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.

సలాడ్ తప్పనిసరి


మధుమేహులు ప్రతిసారి భోజనాన్ని తప్పనిసరిగా సలాడ్‌తో ప్రారంభించాలి. భోజనంలో ఎక్కువ కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఎక్కువ కేలరీలను అందించే ధాన్యాలు, నూనెలు, గింజలు తక్కువ మోతాదులో తీసుకోవాలి. వీలైనంత నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలనే ఎక్కువగా తీసుకోవాలి. ఫలితంగా రక్తంలో విడుదలయ్యే గ్లూకోజ్ తక్కువ మొత్తంలో ఉంటుంది.

ఈ విధంగా తినడం మేలు


మధుమేహులు అన్నం తినడం మానేసి చపాతిలు తినడం వల్ల పెద్దగా లాభమేమి ఉండదు. అన్నం తినడం ఇష్టపడే వారు అన్నం వండే సమయంలో రాజ్‌మా, శెనగలు, పెసల వంటి గింజలను ఐదు భాగాల బియ్యానికి రెండు భాగాల గింజధాన్యాలు కలిపి వండి తీసుకోవడం వల్ల తీసుకునే అన్నం పరిమాణం తగ్గుతుంది. రెండు భోజనాల మధ్య విరామ సమయంలో పండ్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక వేళ భోజనంతో తీసుకోవాలనుకుంటే మాత్రం జామకాయ, బొప్పాయి, పుచ్చపండు వంటివి తీసుకోవాలి.

మధుమేహం - మెంతులు


ప్రతి రోజు మెంతులు తీసుకోవడం మధుమేహం ఉన్న వారికి ఎంతో మంచిది. మెంతులు ఆహారం నుంచి గ్లూకోజ్ విడుదలయ్యే ప్రక్రియ వేగాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి రోజు మెంతులు తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ప్రతిసారీ ఆహారం తీసుకునే ముందు తప్పనిసరిగా ఒకచెంచా మెంతులపొడి నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

జాగ్రత్త తప్పదు


ఒక్కసారి మధుమేహ సమస్య మొదలయిన తర్వాత దాన్ని అదుపు చెయ్యడం మినహా మరో పరిష్కారం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి. తగినంత వ్యాయామం, కొద్దిపాటి ఆహార నియమాలు, ఆరోగ్యవంతమైన జీవన శైలిని అనుసరిస్తూ, క్రమం తప్పకుండా మందులు వాడుతూ ఉంటే ఆరోగ్య వంతమైన జీవితాన్ని ఎక్కువ కాలం పాటు కొనసాగించవచ్చు. అలా కాకుండా వీటిలో ఏ ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేసినా దుష్ప్రభావాలు త్వరగా దాడి చేస్తాయి. ఫలితంగా జీవన నాణ్యత తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. దుష్ప్రభావాలు కనిపించే సమయాన్ని మనం వీలైనంత వరకు వాయిదా వెయ్యడానికి ఈ జాగ్రత్తలన్నీ ఉపకరిస్తాయి.

మధుమేహం వచ్చిందని తెలిసిన వెంటనే ఇక జీవితంలో రుచి పోయినట్టేనని చాలా మంది బెంగపడిపోతారు. ఇక తీపితో తమకు రుణం తీరిపోయిందని బాధపడతారు. ఇది కొంత నిజమైనప్పటికీ అంతా నిజం కాదు.
నిజా నిజాలు
-అపోహ - తీపి పదార్థాలు ఎక్కువగా తినే వారికి మధుమేహం వస్తుంది.
నిజం - తీపి పదార్థాలు తినడం వల్ల మధుమేహం రాదు కానీ మధుమేహం వచ్చిన వాళ్లు తీపి తినడం మానెయ్యాలి.
-అపోహ - నూనె పదార్థాలు కారంగా ఉండేవి తినొచ్చు.
నిజం - తీపి కాదు కదా ఎంతైనా తినొచ్చు అనుకుంటారు చాలా మంది కానీ నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోక పోవడమే మంచిది. అవి కారంగా ఉండేవైనా, తీపివైనా సరే.
-అపోహ - మధుమేహ సమస్య మొదలైందంటే అన్నం తినకూడదు.
నిజం- అన్నం తినే వారు అన్నం తినొచ్చు. చపాతి తినే వారు చపాతి తినొచ్చు. కానీ అన్నం ఎంత తింటున్నామనే దానికి లెక్కతెలియదు. చపాతిలైతే ఎన్ని తింటున్నామన్న లెక్క ఉంటుంది అందువల్ల ఎంత తింటున్నది తెలుస్తుంది. అయితే అన్నంలోనైనా చపాతిలోనైనా ఉండే కార్బోహైడ్రేట్ల స్థాయి ఒకేలా ఉంటుంది.
-అపోహ - మధుమేహులు పండ్లు తినకూడదు.

janaki


నిజం - మధుమేహులు పండ్లు తినకూడదనేది అపోహ మాత్రమే. అన్ని పండ్లు తినవచ్చు, కానీ భోజనంతో పాటు కాకుండా భోజన విరామ సమయంలో పండ్లు స్నాక్స్‌గా తీసుకోవడం మంచిది. చిన్న ముక్కే కదా అని ఒక స్వీట్ తినడం కంటే ఒక పండు తీసుకోవడం మంచిది.

No comments: